అసోసియేషన్ హెల్త్ కేర్ సెంటర్ ఆద్వర్యంలో మెరుగైన వైద్యం

“ఆరోగ్యమే- మహాభాగ్యం” అన్నారు పెద్దలు.ఈ సదుద్దేశంతో ఢిల్లీలోని తెలుగు ప్రజానీకానికి మెరుగైన వైద్యం అందించాలని అసోసియేషన్ 2010 సంవత్సరంలో “ఆంధ్రా అసోసియేషన్ హెల్త్ కేర్ సెంటర్” ను ఏర్పాటు చేసింది. స్థాపించిన అనతికాలంలోనే హెల్త్ కేర్ సెంటర్లో డే కేర్ సేవలను ఏర్పాటు చేసి ఢిల్లీలోని తెలుగు ప్రజలకు, అసోసియేషన్ భవన పరిసరప్రాంతాల వారికి మెరుగైన వైద్య సేవలను అందిస్తూ అత్యంత ప్రాచుర్యం పొందింది. ఈ హెల్త్ కేర్ సెంటర్ లో అన్ని వైద్యపరీక్షలను నిర్వహిస్తున్నారు. వైద్యంకోసం ఇక్కడికి వచ్చే తెలుగు, తెలుగేతర ప్రజల పట్ల వైద్యులు , సిబ్బంది ఎంతో శ్రద్ద తీసుకుంటూ నిర్విరామంగా వైద్య సేవలు అందిస్తూ అందరి ఆదరాభిమానాలనూ పొందుతున్నారు.అంతేకాక అసోసియేషన్ జిల్మిల్ కాలనీలో తెలుగు ప్రజల సౌకర్యార్థం బ్రాంచ్ క్లినిక్ ను ఏర్పాటు చేయడం జరిగింది. డిల్లీలోని ఏ సంస్థ కూడా అందించని వైద్య సేవలను ఆంధ్రా అసోసియేషన్ అందిస్తూ అందరి మన్ననలూ పొందుతోంది.